News December 30, 2025
డబ్బులు వసూలు చేసి తెస్తుండగా ప్రమాదం

ఎలమంచిలి వద్ద ఆదివారం అర్ధరాత్రి
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో రెండు భోగీలు కాలిపోవడంతో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ అనే వృద్ధుడు (70) మరణించిన సంగతి తెలిసిందే. అతని వద్ద ఉన్న బ్యాగులో రూ.6 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను హోల్ సేల్ వస్త్ర వ్యాపారని విజయనగరం నుంచి డబ్బులు వసూలు చేసుకుని తెస్తుండగా ప్రమాదం జరిగినట్లు తుని ప్రభుత్వ రైల్వే ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.
Similar News
News January 2, 2026
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News January 2, 2026
అయిజ: యూరియా కొరత లేదు- జిల్లా వ్యవసాయ అధికారి

గద్వాల జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అయిజలో పర్యటించి పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ ఉన్నంతవరకు రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.
News January 2, 2026
ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.


