News September 27, 2024

డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు: DK అరుణ

image

అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బుల మూటలు చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ హైడ్రా డ్రామాలు ఆడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాలన చేతకాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, హైడ్రా పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, HYD అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

News February 23, 2026

పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.