News February 5, 2025
డయల్-100కు జనవరి నెలలో 4056 కాల్స్

సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు జనవరి నెలలో 4056 కాల్స్ వచ్చాయని పోలీస్ కమిషనర్ సునీల్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై 57 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, వీటిలో హత్యాయత్నం-1, మహిళలపై వేధింపులు – 1, దొంగతనాలు – 9, సాధారణ ఘటనలు – 14, యాక్సిడెంట్లు 11, అనుమానాస్పద మరణాలు-4, ఇతర కేసులు-17 అని తెలిపారు.
Similar News
News January 7, 2026
LIC జీవన్ ఉత్సవ్.. బెనిఫిట్స్ ఇవే

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితాంతం ఆదాయం, బీమా రక్షణ లభిస్తుందని తెలిపింది. JAN 12 నుంచి స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నెల వయసు పిల్లల నుంచి 65ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5L. గరిష్ఠ పరిమితి లేదు. ప్రతి ₹వెయ్యికి ఏటా₹40 చొప్పున జమ అవుతుంది. 7-17ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది. దీన్ని LIC వద్దే ఉంచితే 5.5% చక్రవడ్డీ చెల్లిస్తుంది.
News January 7, 2026
నిర్మల్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సపూర్(జి)కి చెందిన నితిన్(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్‌పై నిర్మల్ బయలుదేరాడు. రహదారిపై అటవీ జంతువు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News January 7, 2026
WGL: కుక్కలు అడ్డు వచ్చి ఇద్దరు మృతి

జిల్లాలోని గీసుగొండలో కుక్కల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకే మండలానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. ఎలుకుర్తి హవేలీకి చెందిన ఆడెపు శివ ఇటీవల మచ్చపూర్ వద్ద కుక్క అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషాదం మరువక ముందే గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోశ్ కుమార్ ధర్మారం వద్ద నిన్న కుక్క కారణంగా ప్రాణాలు విడిచారు.


