News September 11, 2025

డ‌యేరియా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉన్నాం: నారాయణ

image

న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల నేపథ్యంలో తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, డయేరియా కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

Similar News

News September 11, 2025

సంగారెడ్డి: జిల్లాలో వర్షపాతం వివరాలు

image

సంగారెడ్డి జిల్లాలో గురువారం కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా సిర్గాపూర్లో 50 మిమీ, జహీరాబాద్ 46, ఖేడ్ 42.5, కడపల్ 42.3, రుద్రారం 41.3, కొండాపూర్ 23.5, కోహీర్ 23.3, మనూర్ 22.3, పాశ మైలారం 20.8, వట్టిపల్లి 20, సదాశివపేట 18.3, హత్నూర 15.3, పుల్కల్ 15, కంది 13, సంగారెడ్డి 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.

News September 11, 2025

ALERT: మీరు గురక పెడతారా?

image

చాలామందికి నిద్రలో గురక రావడం సాధారణం. అయితే బిగ్గరగా గురక పెట్టేవారిని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది స్లీప్ ఆప్నియాకు సంకేతం కావొచ్చని, చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆక్సిజన్ సరిగా అందక గుండెపోటు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. బ్రీతింగ్ మాస్కులు వాడటం, వెయిట్ తగ్గడం, సర్జరీ ఇతర చికిత్సల ద్వారా నయమవుతుందని సూచిస్తున్నారు.

News September 11, 2025

MHBD జిల్లాలో 27,347 టన్నుల యూరియా సరఫరా: డీఏఓ

image

మహబూబాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 27,347 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎం.విజయనిర్మల తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 3.70 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయిందని ఆమె వివరించారు.