News September 28, 2025

డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పాత గుంటూరు యాదవ బజార్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం తనిఖీ చేశారు. ఓపి, అందులో నమోదైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. నగరంలో డయేరియా నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News September 27, 2025

పవన్ ఎందుకు మౌనంగా ఉన్నావు?: అంబటి

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక పక్క జగన్, మరో పక్కన మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఈ క్రమంలోనే అన్యాయం జరిగితే తిరగబడే స్వభావం అన్నావు, అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు ? అంటూ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. అంబటి తన Xలో శనివారం మాట్లాడారు.

News September 27, 2025

ANU: ఏపీ పీసెట్ -2025 చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

image

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన పీసెట్- 2025కు సంబంధించిన చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రవేశాల కన్వీనర్ పాల్ కుమార్ శనివారం విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 30 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

News September 27, 2025

ఏపీని స్పోర్ట్స్‌ డెస్టినేషన్‌గా మారుస్తాం: మాధవ్

image

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ డెస్టినేషన్‌గా మారే విధంగా కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. చేబ్రోలు (M) వడ్లమూడి ఓ వర్సిటీలో జరుగుతున్న నేషనల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను శనివారం మాధవ్ సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, ఈగల్‌ ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు.