News February 22, 2026

డాక్ సేవకుల వల్లే సూపర్-6 హిట్ అయింది: సీఎం చంద్రబాబు

image

AP: డాక్ సేవకులతోనే సూపర్ సిక్స్ హిట్ అయిందని.. 33% డీబీటీలు వీరి వల్ల పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏఐ, మెషీన్లు ఉన్నా హ్యూమన్ టచ్ డాక్ సేవకులు మాత్రమే ఇవ్వగలరన్నారు. గుంటూరులో డాక్ సేవక్ సమ్మేళన్‌కు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్ సేవకులకు ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వాలని సీఎం కేంద్రమంత్రిని ఈ సందర్భంగా కోరారు.

Similar News

News February 28, 2026

కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తాజా మాజీ సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ప్రసాద్ 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తొలుత ఉమ్మడి APలో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆపై పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌గా కొనసాగుతున్న ఆయన CSగా ఎంపికయ్యారు.

News February 28, 2026

AI ఫియర్.. ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు!

image

ఏఐ విప్లవం ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నా కొన్ని వృత్తులు మాత్రం అత్యంత సురక్షితమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి శారీరక నైపుణ్యం ఉన్నవారిని ఏఐ భర్తీ చేయలేదు. అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, చెఫ్, వ్యవసాయం వంటి వృత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చేతులతో చేసే పని, మనుషులతో జరిపే సంభాషణ ఉన్నంత కాలం ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు.

News February 28, 2026

పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

image

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.