News January 12, 2026

డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

image

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. ‘దాసరి నారాయణరావు గారు మా తాతకు కజిన్. మా నానమ్మ ప్రభ కిక్ మూవీలో హీరో తల్లిగా చేశారు. నన్ను ఇలియానాకు చెల్లిగా చేయమన్నారు. అప్పుడు నేను ఫోర్త్ క్లాస్. అందుకే పేరెంట్స్ వద్దన్నారు. తర్వాత చాలా ఫీలయ్యారు’ అని తెలిపారు.

Similar News

News February 16, 2026

T20 WCలో ఇవాళ్టి మ్యాచులు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు అఫ్గాన్‌తో UAE, 3PMకు ఇంగ్లండ్‌తో ఇటలీ, 7PMకు ఆస్ట్రేలియాతో శ్రీలంక తలపడనున్నాయి. గెలిస్తే ఇంగ్లండ్, శ్రీలంక సూపర్8కి చేరుకోనున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఓడితే అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ప్రస్తుతం ఇండియా, వెస్టిండీస్ మాత్రమే అధికారికంగా సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి.

News February 16, 2026

మాజీ ఎంపీ కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

News February 16, 2026

చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

image

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, చర్మంముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే చేపలు, సిట్రస్‌ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, దాల్చినచెక్క, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.