News March 5, 2025

డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీబీఏ, బీఏ, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News March 6, 2025

గుడి ధ్వంసం.. MLA, అధికారులపై ఫిర్యాదు

image

లోయపల్లిలో గుడి ధ్వంసం చేసిన అధికారులపై, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి‌పై జాతీయ ST కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర కమిషన్‌కు అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్, రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా ఫిర్యాదు చేశారు. గత నెల 25న సేవాలాల్ మహారాజ్ గుడిని కొందరు కుట్రపూరితంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీని సస్పెండ్ చేయాలని, ST/SC కేసు నమోదు చేయాలని కోరారు.

News March 6, 2025

‘తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా.. సీఎం వివరణ ఇవ్వాలి’

image

తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్‌, సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వాలని మల్లన్న కోరారని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

News March 6, 2025

సీపీఎంకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి: కూనంనేని

image

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!