News September 13, 2025

డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

డిగ్రీ ప్రవేశాలకు చివరి విడతగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.సునీత తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొందేందుకు ఉన్నత విద్యా మండలి ఈ షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News March 4, 2026

వైసీపీ కోఆర్డినేటర్లుగా కన్నబాబు, బొత్స కొనసాగింపు

image

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు, ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణలను యధావిధిగా కొనసాగించింది. వీరి బాధ్యతల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పార్టీ బలోపేతానికి, నాయకుల మధ్య సమన్వయానికి వీరిద్దరి అనుభవం తోడ్పడుతుందని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

News March 4, 2026

కృష్ణా: చల్లారని ప్రొటోకాల్ చిచ్చు.. TDPలో దుమారం

image

తిరువూరు MLA కొలికిపూడి శ్రీనివాస్, VJA MP కేశినేని చిన్ని మధ్య తలెత్తిన రాజకీయ దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. నెమలి ఆలయం వద్ద ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య వివాదం తేలెత్తింది. ఈ అంశాన్ని కొలికిపూడి తనదైన శైలిలో స్టేటస్ పెట్టగా, MP వర్గం సవాల్‌గా తీసుకుంది. AP సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఆల‌య ఘ‌ట‌న‌, పూర్వాపరాలతోపాటు మరో 2 అంశాలతో నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

News March 4, 2026

NTR: రూ.38.83 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో కీలక ఫలితాలు సాధించినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆపరేషన్ నార్కోస్ కింద రూ.38.83 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 11 మందిని అరెస్టు చేసి, అధికారులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా రూ.1,65,505ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.