News March 17, 2025

డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్  అరెస్ట్

image

కదిరిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్ట్‌‌లో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. హోలీ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.

Similar News

News July 4, 2025

బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

image

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News July 4, 2025

కృష్ణా: LLM 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో LLM 2వ సెమిస్టర్ (2024-25 విద్యాసంవత్సరం) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 26 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జులై 10 నుంచి 21 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://kru.ac.in/ ను సందర్శించవచ్చు.

News July 4, 2025

ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంతో స్పెషల్.. నెట్టింట చర్చ

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్‌తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.