News March 26, 2025

డిచ్‌పల్లి: చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

image

మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇది వరకు జిల్లాలో కలెక్టర్‌గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పారు. మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.

Similar News

News July 10, 2025

NZB జిల్లాలో 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.

News July 10, 2025

NZB: కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ: MLCకవిత

image

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 10, 2025

NZB: ఫోక్ డాన్సర్ జానూ లిరి సందడి

image

ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.