News January 23, 2025
డిచ్పల్లి: బైక్ చోరీ.. నిందితుడి అరెస్ట్

బైక్ చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు గురువారం డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ధర్మారం(బీ) లో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగుడు చోరీ చేశాడు. బాధితుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిచ్పల్లిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బిచ్కుందకు చెందిన మంగళి దత్తు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించి, నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News February 14, 2026
NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్‌లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.
News February 14, 2026
NZB: 2020లో 28.. 2026లో 28 సీట్లే

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి 2020 ఎన్నికల్లో 28 సీట్లు వచ్చివచ్చాయి. అయితే ప్రస్తుత 2026 ఎన్నికల్లో కూడా 28 సీటు రావడం గమనార్హం. గత ఎన్నికల్లో 28 సీట్లతో కార్పొరేషన్‌లో లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 12 సీట్లు గెలిచిన BRS 18 మంది MIM, ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ కార్పోరేటర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో?
News February 14, 2026
NZB: ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం: TPCC చీఫ్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఘన విజయం అందజేసి ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. NZBలో ఆయన శుక్రవారం రాత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో 90కిపైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, 1,300కుపైగా వార్డులు, 154కుపైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు.


