News June 15, 2024
డిచ్‌పల్లి: సిగరెట్ కొని.. బంగారు గొలుసు లాక్కెళ్లి

ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లిన ఘటన డిచ్పల్లి PS పరిధిలో శుక్రవారం జరిగింది. SI మహేష్ వివరాలిలా.. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో మొగుళ్ల వినోద కిరణా షాప్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్ తీసుకొని రూ.50 ఇచ్చారు. తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలో మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.
News September 13, 2025
NZB: హైకోర్టు జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు. జడ్జీలు నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శిచగా కలెక్టర్ వారితో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
News September 13, 2025
SRSPకి వరద.. 22 గేట్ల ద్వారా నీరు విడుదల

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి 82,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 22 వరద గేట్ల ద్వారా 64,680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. IFFC ద్వారా 8 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 800, ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.