News January 3, 2025
డిచ్పల్లి: 463 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
డిచ్పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో శుక్రవారం 463 మంది SCTPCs (TGSP)లకు 2024 “దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధూ శర్మ హజరయ్యారు. 9 నెలల శిక్షణలో నేర్చుకున్నది శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించాలని ఆమె సూచించారు. కమాండెంట్ పి.సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 6, 2025
KMR: నవోదయలో లైంగిక వేధింపులు.. టీచర్లకు రిమాండ్
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గతంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు.
News January 6, 2025
లింగంపేట: బెట్టింగ్ యాప్‌తో యువకుడు బలి
బెట్టింగ్ యాప్‌లో సొమ్ము పోగొట్టుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం ఐలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగరాజు(29) భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆన్‌లైన్ గేమ్స్‌లో మోసపోయి చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 5, 2025
నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనతో ముందుకు సాగుతున్న విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజీపీకి లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.