News August 21, 2025

డిచ్పల్లి: PG పరీక్షలను పరిశీలించిన TU రిజిస్ట్రార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలను TU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం 5వ రోజు పరీక్షల్లో భాగంగా ఉదయం పరీక్షకు 80 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News August 21, 2025

రూ.50.95 కోట్ల రుణాలు: NZB కలెక్టర్

image

జిల్లాలో ఇప్పటి వరకు 4,348 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని NZB కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మంది లబ్ధిదారులకు రూ.46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ.4.36 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను చేపట్టాలని కలెక్టర్ కోరారు.

News August 21, 2025

NZB: త్వరలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు: CP

image

జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

News August 21, 2025

జులైలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జులై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ కేసుల్లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 77 కేసుల్లో జైలు శిక్ష విధించగా మిగతా కేసులలో జరిమానాలు విధించారని వివరించారు.