News November 19, 2025

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం: ఎస్పీ

image

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్‌ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.

Similar News

News April 5, 2026

జగ్జీవన్ రామ్ విగ్రహానికి కర్నూలు కలెక్టర్ నివాళి

image

డా.బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని కలెక్టర్ సిరి అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారని ఆమె అన్నారు.

News April 5, 2026

కర్నూలు: 205 ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూ

image

కర్నూలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి దీప్తి తెలిపారు. ఇన్నోవిజన్, GPS రెన్యవబుల్ ఎనర్జీ, బ్లూస్లార్, అంబర్ తదితర సంస్థలు ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 205 ఖాళీలున్నాయని, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.

News April 4, 2026

డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

image

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.