News December 28, 2025

‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న మోసాల పట్ల వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలను హెచ్చరించింది. సీబీఐ, పోలీస్ అధికారులమని నమ్మిస్తూ వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్టపరంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియ లేదని, ఇలాంటి కాల్స్ వస్తే భయపడకూడదని స్పష్టం చేశారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Similar News

News December 31, 2025

అనకాపల్లి: సహజ ప్రసవం ద్వారా 4.8 కిలోల శిశువు జననం

image

అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సహజ ప్రసవం ద్వారా 4.8 కిలోల బరువు గల శిశువు జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పెందుర్తికి చెందిన రూపవతి (25) మంగళవారం పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. శిశువు తల ముందు బయటకు వచ్చిందని.. భుజాలు రావడంలో సమస్య తలెత్తడంతో మ్యాన్ అవర్ విధానంలో సహజ ప్రసవం చేసినట్లు డాక్టర్ మానస తెలిపారు.

News December 31, 2025

వరంగల్: తరలివచ్చిన చిరుధాన్యాలు.. పెరిగిన ధరలు

image

WGL ఎనుమాముల మార్కెట్‌కి ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే నేడు ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,490 ధర రాగా.. ఈరోజు రూ.8,550 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్న రూ.5,400 ధర పలికితే.. నేడు రూ.5,600 పలికింది. అలాగే, క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,050 ఉండగా, ఈరోజు రూ.2,055 అయింది. ఎల్లో రకం మిర్చికి రూ.23వేలు, పసుపుకి రూ.13,200 ధర వచ్చాయి.

News December 31, 2025

జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు

image

నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.