News November 18, 2025

డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

image

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్‌ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News November 18, 2025

HYD: ఫ్యాన్సీ నంబర్లకు FULL DEMAND

image

తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్‌కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్‌లో TG 09 సిరీస్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్‌కు అనేక మంది దరఖాస్తు చేసే పరిస్థితుల్లో రవాణా శాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అలాగే ఓవర్ ల్యాపింగ్ అప్లికేషన్లకు ఆన్‌లైన్ వేలంపాట విధానం ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచుతోంది.

త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.