News December 16, 2025
డిజిటల్ బోధన.. అలిపిరి వద్ద టౌన్ షిప్: TTD

TTD విద్యాసంస్థల్లో డిజిటల్ భోదన కోసం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, CC కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ కాలేజీల తరహాలో రెండు JR.కళాశాల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తాం. అలిపిరి సమీపంలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణం చేయనున్నాం. దీని ద్వారా 20-25 వేల మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.
Similar News
News December 20, 2025
స్పైస్‌జెట్ ప్యాసింజర్‌పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్‌జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.
News December 20, 2025
GNT: ఆర్థిక భారమా.. దీర్ఘకాలిక ప్రయోజనమా?

ప్రభుత్వ కఠిన నియంత్రణ చర్యలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అపార్ట్‌మెంట్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల నిబంధనల అమలులో భాగంగా అక్రమ నిర్మాణాలు, డివియేషన్‌ల వల్ల G+3 నియమాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ ధరలు రూ. 40 నుంచి రూ.55 లక్షల వరకు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది. దీనిపై మీ COMMENT
News December 20, 2025
కాకినాడ: ముడుపులిస్తే డిప్యూటేషన్!

జిల్లా వైద్యారోగ్యశాఖ అవినీతి నిలయంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులిస్తే కోరిన చోటకు డిప్యూటేషన్ ఇస్తున్నారని ఉద్యోగ వర్గాల్లోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది డిప్యూటేషన్‌పై DMHO ఆఫీసులో పనిచేస్తుండగా తాజాగా యు.కొత్తపల్లి, తూరంగి phcల నుంచి ఇద్దరు, ఇతర ప్రాంతాల నుంచి నలుగుర్ని నియమించారు. సుదూరు ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు హెడ్ ఆఫీసులకే పరిమితమవుతున్నారు.


