News February 18, 2026
డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it
Similar News
News February 20, 2026
బాలికపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

హైదరాబాద్‌లో 16 ఏళ్ల బాలికపై <<19182426>>గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. 8వ తరగతి అమ్మాయి ఈ నెల 7న చార్మినార్‌లో షాపింగ్‌కు వెళ్లగా 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 16న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి అతడిని కలిసింది. అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెకు మద్యం తాగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.
News February 20, 2026
4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్‌లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.
News February 20, 2026
ప్రాంప్ట్ ఇస్తే చాలు.. సినిమా రెడీ: హాలీవుడ్‌ను వణికిస్తున్న చైనా యాప్

చైనాకు చెందిన బైట్‌డాన్స్ విడుదల చేసిన ‘Seedance 2.0’ అనే కొత్త AI యాప్ హాలీవుడ్‌ను వణికిస్తోంది. కేవలం కొన్ని ప్రాంప్ట్‌లతో ఇది సినిమా క్వాలిటీ వీడియోలను, సౌండ్ ఎఫెక్ట్స్, డైలాగ్‌లతో సహా సృష్టించగలుగుతోంది. స్పైడర్ మ్యాన్, డెడ్‌పూల్ వంటి పాపులర్ క్యారెక్టర్లతో ఈ యాప్ సృష్టించిన వీడియోలు వైరలవ్వడంతో.. డిస్నీ, పారామౌంట్ వంటి స్టూడియోలు కాపీరైట్ ఉల్లంఘన అంటూ బైట్‌డాన్స్‌పై మండిపడుతున్నాయి.


