News October 25, 2025
డిప్యూటీ ఈవోల బదిలీ తాత్కాలికంగా నిలుపుదలకు కారణం అదేనా?

TTDలో వివిధ విభాగాల్లోని డిప్యూటీ ఈవోల బదిలీలు ఈనెల 8న జరిగినా.. రెండురోజుల తర్వాత పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు యథాస్థానంలోనే కొనసాగాలని వారికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే తాత్కాలికంగా వాయిదా చేయడానికి రాజకీయల ఒత్తిళ్లు కారణమా..? మరేమైనా కారణాలు ఉన్నాయా…? అని ఉద్యోగుల్లో చర్చ సాగుతోందట. త్వరలోనే పాలకమండలి సమావేశం అనంతరం మళ్ళీ బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News October 25, 2025
స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.
News October 25, 2025
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకండి: కలెక్టర్

తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కోరారు.
News October 25, 2025
సంగారెడ్డి: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఇప్పటికే బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, రివిజన్‌ను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.


