News August 11, 2025

డిప్యూటీ సీఎంపై కామెంట్స్.. ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

image

ఒంగోలులో అతడు రీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఆదివారం ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో పలువురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.

Similar News

News August 13, 2025

ప్రకాశం జిల్లాలోని కౌలు రైతులకు గుడ్ న్యూస్!

image

ప్రకాశం జిల్లాలోని అర్హులైన కౌలు రైతులకు CCRC కార్డులు మంజూరు చేయాలని JC గోపాలకృష్ణ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు కార్డులను మంజూరు చేయాలన్నారు.

News August 12, 2025

ఆ సర్వేతో ఒంగోలుకు రూ.50కోట్లు: కమిషనర్

image

ఒంగోలు నగరంలో నక్ష సర్వేను 30 రోజుల్లో సచివాలయాల సెక్రటరీలు పూర్తి చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో నక్ష సర్వే తీరుపై కమిషనర్ సమీక్షించారు. ఈ సర్వే పూర్తి చేసిన వెంటనే నగరపాలక సంస్థకు కేంద్రం రూ.50 కోట్ల ప్రోత్సాహకంగా అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి సిబ్బంది పక్కాగా పనిచేయాలని కోరారు.

News August 12, 2025

OUDA ఛైర్మన్‌గా రియాజ్

image

ఒంగోలుకు చెందిన జనసేన నేత షేక్ రియాజ్‌కు కీలక పదవి లభించింది. ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(OUDA) ఛైర్మన్‌గా ఆయనకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. గతంలో ఆయన జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయడంతో కీలక పదవి కట్టబెట్టారు.