News March 20, 2025

డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 22న డిప్యూటీ సీఎం జిల్లాకు రానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫారంపాండ్‌కు భూమిపూజ చేయనున్నారు. తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News March 21, 2025

బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

image

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.

News March 21, 2025

పాస్టర్ల వేతనాలకు రూ.12.82 కోట్లు విడుదల

image

రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ.5000 ప్రకారం వేతనం ఇస్తామన్నారు. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.

News March 21, 2025

కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.

error: Content is protected !!