News January 18, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

image

కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి శనివారం పాలాభిషేకం చేశారు. ముందుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన అమృతరావు విగ్రహానికి జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.

Similar News

News January 19, 2025

భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు

image

వైసీపీ అధినేత జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను, పరిశీలకులను మారుస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను)ని నియమించారు. మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు.

News January 18, 2025

శాసనసభ స్థానాల్లో వైసీపీ పరిశీలకుల నియామకం

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు శాసనసభ స్థానాలకు పరిశీలకులను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గాజువాక సమన్వయకర్తగా దేవం రెడ్డి, భీమిలి సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, చోడవరం సమన్వయకర్తగా అమర్నాథ్, మాడుగుల సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడును అధిష్టానం నియమించింది.

News January 18, 2025

నేడు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శనివారం విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా రేపు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd AC, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.