News December 3, 2025
‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.
Similar News
News April 5, 2026
వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఏప్రిల్ 6–11 వరకు ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఆహార భద్రత, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సురక్షిత మాతృత్వం, ఎయిడ్స్ అవగాహన, యోగా, మందుల వినియోగంపై కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజలు, వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News April 5, 2026
15 ఏళ్లకే పోర్న్ సైట్‌లో నా ఫొటో పెట్టారు: జాన్వీ

డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల 15 ఏళ్లకే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించారు. పోర్న్ వెబ్‌సైట్‌లో తన మార్ఫ్‌డ్ ఫొటోలను అప్‌లోడ్ చేశారని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘తోటి స్టూడెంట్స్ ఆ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు అవి కనిపించాయి. ఆ విషయాన్ని నాకు చెప్పడంతో బాధపడ్డా. సోషల్ మీడియాలో నైతికత లేదని అర్థమైంది. ఇప్పటికీ డీప్ ఫేక్ కారణంగా సమస్యలు వస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 5, 2026
SRH చెత్త రికార్డు

హైదరాబాద్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH చెత్త రికార్డులను మూటగట్టుకుంది. తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోరు(35/4) చేసిన జట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో KKR(31/3)vs డెక్కన్ ఛార్జర్స్, RR(32/5)vs RCB, MI(32/4)vsKXIP ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్‌కు పవర్ ప్లేలో ఇదే నాలుగో లోయెస్ట్ స్కోర్(22/3). గతంలో 14/3vsRR, 20/3vsPBKS, 21/3vsRR అత్యల్ప స్కోర్లు చేసింది.


