News January 4, 2026
డిప్రెషన్ లక్షణాలివే..

డిప్రెషన్ ఉంటే ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంటారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. మూడీగా కనిపిస్తారు. అలాగే ఏదో తప్పు చేశామన్న భావన వారిలో ఉంటుంది. దీని వల్ల వారు ఇతరులతో సరిగ్గా మాట్లాడరు. సడెన్‌గా బరువు తగ్గడం/ పెరగడం జరుగుతుంది. కొందరికి విపరీతమైన ఆకలి, కొందరికి తిండి అంటే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తీవ్రమైన అలసట, నీరసం కూడా ఉంటాయి.
Similar News
News February 3, 2026
క్యాబినెట్ భేటీ: ‘నెయ్యి కల్తీ’పై 2 గంటలు PPT

AP: క్యాబినెట్ మీటింగ్ అనేసరికి అధికారులు పలు అంశాలతో అజెండాను రెడీ చేస్తుంటారు. మంత్రివర్గమూ సుదీర్ఘంగా వాటిని చర్చిస్తుంది. అయితే ఇవాళ్టి భేటీలో మాత్రం శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఒక్కదానిపైనే చర్చించింది. నెయ్యి కల్తీపై దాదాపు 2 గంటలు PPT ప్రజెంటేషన్‌తో CM వివరించారు. సిట్ పేర్కొన్న అంశాలను లోతుగా విశ్లేషించారు. తెరవెనుక వ్యక్తులెవరో కూడా తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
News February 3, 2026
అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే ₹లక్ష కోట్ల లాభం!

US టారిఫ్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి ట్రేడింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 12.87% లాభపడగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11.89%, అదానీ ఎనర్జీ 10% వరకు పెరిగాయి. సుంకాల తగ్గింపు వల్ల ఆ గ్రూప్ ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹లక్ష కోట్లకు పైగా పెరిగి ₹13.78 లక్షల కోట్లకు చేరుకుంది.
News February 3, 2026
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


