News March 27, 2025

డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి

image

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు

Similar News

News March 30, 2025

కరీంనగర్: మండలాల వారీగా సమన్వయకర్తల నియామకం

image

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి జిల్లాలో నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మండలాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగం, పరిరక్షణ స్వాతంత్రం గురించి ప్రజలకు వివరించనున్నారు.

News March 30, 2025

కరీంనగర్: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

News March 30, 2025

కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. తంగళ్లపల్లి(M) బస్వాపూర్‌కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.

error: Content is protected !!