News November 17, 2025
డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Similar News
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరిగిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.