News December 5, 2025
డిసెంబర్, జనవరి పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
Similar News
News December 5, 2025
CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

ఫ్యూచర్‌లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం


