News November 27, 2025
డిసెంబర్ 1 నుంచి సీఎం జిల్లాల టూర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుండటం, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో CM రేవంత్ జిల్లాల పర్యటన చేయనున్నట్లు సమాచారం. DEC 1 నుంచి 7 వరకు విస్తృతంగా పర్యటిస్తారని CMO వర్గాలు తెలిపాయి. తొలుత మక్తల్ (నారాయణపేట జిల్లా), కొత్తగూడెం, దేవరకొండ, సిద్దిపేట, హుస్నాబాద్‌లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నాయి. ఓయూ విద్యార్థులతోనూ మాట్లాడుతారని చెప్పాయి.
Similar News
News November 28, 2025
రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 28, 2025
పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <
News November 28, 2025
పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.


