News November 6, 2024
డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: గుంటూరు కలెక్టర్
గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.
Similar News
News November 24, 2024
IPL వేలంలో మన గుంటూరు కుర్రాళ్లు.!
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ రూ.30లక్షలు, పృథ్వీరాజ్‌యర్రా రూ.30లక్షల బేస్ ప్రస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన గుంటూరు జిల్లా ఆటగాళ్లు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
నేను పుట్టిన ఊరు నరసరావుపేట: సీనియర్ సినీ నటుడు
తాన పుట్టిన ఊరు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అని సీనియర్ సినీనటుడు నరేశ్ అన్నారు. న్యూ మాన్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ పోటీలు స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించేందుకు వచ్చిన ఆయన తన అమ్మ విజయనిర్మలతో కలిసి చిన్నతనంలో ఇక్కడే పెరిగినట్లు గుర్తుచేసుకున్నారు. పట్నంలో దొరికే గోలి సోడా, మిరపకాయ బజ్జీలు తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అనంతరం రాజా గారి కోట ఫేమస్ అన్నారు.
News November 24, 2024
గుంటూరు: కేసుల పురోగతిని తెలుసుకున్న అంబటి
ఐ-టీడీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గతంలో నగరంలోని పలు స్టేషన్లలో ఐ-టీటీడీపై తాము ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులతో కలిసి అంబటి శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.