News December 28, 2025

డిసెంబర్ 31 నుంచి సంక్రాంతి వరకు నిఘా: బాపట్ల SP

image

బాపట్ల జిల్లాలో మైనర్లు మాత్రమే వచ్చి రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో రూములు కోరితే ఇవ్వకూడదని SP ఆదేశించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి సంక్రాంతి పండుగ ముగిసేవరకు, అనంతరం జిల్లాలో ఎలాంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగనీయబోమన్నారు. రిసార్ట్స్, హోటళ్లలో గానీ, అక్కడ బస చేసినవారి ద్వారాగానీ చట్ట ఉల్లంఘనలు జరిగితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 28, 2025

పథకాల అమలుకు సిటిజన్ ఈకేవైసీ తప్పనిసరి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే లక్ష్యంతో జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను చేయించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగ స్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1,48,969 Citizen e-KYCలు ఉండగా, ఇప్పటి వరకు 43,306 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 1,05,663 పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

News December 28, 2025

Op సిందూర్ టైమ్‌లో బంకర్‌లోకి వెళ్లమన్నారు: పాక్ అధ్యక్షుడు

image

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం బంకర్‌లోకి వెళ్లాలని సైనిక కార్యదర్శి తనకు సూచించారని వెల్లడించారు. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు. కాగా భారత క్షిపణుల ధాటికి పాక్ బెంబేలెత్తిపోయిందనే విషయం దీని ద్వారా స్పష్టమైంది.

News December 28, 2025

గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

image

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.