News January 11, 2025
డి.హీరేహాళ్: పోలీసుల ఉరుకుల పరుగులు.. 2 గంటల్లో కేసు క్లోజ్

డి.హీరేహాళ్ మండలం జాజరకల్లుకు చెందిన నలుగురు మైనర్‌లు శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయారు. తల్లితండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఎస్సై గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకట రమణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పిల్లలు కర్ణాటక రాష్ట్రం ఉలిగిలో ఉన్నట్లు గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.
Similar News
News April 25, 2025
మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.