News July 18, 2024
డీఎస్సీ అభ్యర్థులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు డీఈఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఖమ్మం 99512 12603, భద్రాద్రి జిల్లా అభ్యర్థులు 98857 57137కు సంప్రదించాలన్నారు.
Similar News
News August 29, 2025
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలి: కలెక్టర్

పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, దత్తత ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని పేర్కొన్నారు.
News August 29, 2025
ఖమ్మం: డెంగీ ఏలిషా యంత్రాల టెండర్లకు ఆహ్వానం

ఖమ్మం జిల్లాకు 5 డెంగీ ఏలిషా వాషర్, రీడర్ యంత్రాలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DMHO కళావతి బాయి తెలిపారు. ఆసక్తిగల సరఫరాదారులు జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆగస్టు 31వ తేదీ లోపు తమ టెండర్లను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు వాటిని ఫైనల్ చేయనున్నట్లు ఆమె వివరించారు.
News August 28, 2025
పగిడేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన సీపీ

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.