News September 24, 2025

డీఎస్సీ అభ్యర్థులకు భోజనం ఏర్పాట్లు: అనకాపల్లి డీఈవో

image

డీఎస్సీలో ఎంపికైనవారు అమరావతిలో ఈనెల 25న నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడ వెళుతున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి 900 మంది, నక్కపల్లి నుంచి 2000 మంది బస్సుల్లో వెళుతున్నట్లు తెలిపారు. వీరికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీరితోపాటు ఎంఈఓలు వెళుతున్నారని అన్నారు.

Similar News

News September 24, 2025

అక్టోబర్ 16 నుంచి కేయూ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియం త్రణాధికారి డా.ఎమీ అసీం ఇక్బాల్ మంగళవారం తెలిపారు. అక్టోబరు 16, 18, 22, 24, 27, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

News September 24, 2025

మిడ్జిల్: విధుల్లోనే తహశీల్దార్‌కు గుండెపోటు

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ తహశీల్దార్‌కు విధులోనే గుండెపోటు వచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కార్యాలయ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాలు.. మిడ్జిల్ తహశీల్దార్ పులిరాజు బుధవారం యథావిధిగా ఎన్నికలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఉన్న చోటే కుప్పకూలారు. తోటి సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News September 24, 2025

PDPL: సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారు: కవిత

image

లాభాలను తక్కువగా చూపి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారంటూ MLC కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నికర లాభంలో 34% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కార్మిక సంఘం నేతలతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా, ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 BONUSగా అందనుంది.