News August 25, 2025

డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ వాయిదా: డీఈవో

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల వెరిఫికేషన్‌ను సోమవారం సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

Similar News

News August 25, 2025

HYD: సీఎంకు ఇంత భయం ఎందుకు?: RSP

image

HYD ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రాక నేపథ్యంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంపై BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకు? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అని నిలదీశారు.

విశాఖలో ఖమ్మం యువతి అత్మహత్య

image

విశాఖలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్, రమ్య HYDలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ విశాఖ వచ్చారు. కొబ్బరితోట ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకుందామని రమ్య కోరగా..‘నాకు ముందే పెళ్లి అయ్యింది. నిన్ను చేసుకోలేను’ అని చెప్పి నరేశ్‌ ఎటో వెళ్లిపోయాడు. ఇంట్లో రమ్య శనివారం ఉరేసుకుంది. నరేశ్‌ని అరెస్ట్ చేసినట్లు 2టూన్ CI ఎర్రన్నాయుడు తెలిపారు.