News December 1, 2025
డీఎస్సీ-2025 టీచర్ల వేతనాల పట్ల ఆందోళన

డీఎస్సీ-2025తో ఎంపికైన టీచర్లకు 2 నెలలు గడిచినా జీతాలు విడుదల కాకపోవడంపై ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త టీచర్లు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇతర శాఖల నుంచి ఎంపికైన వారికి లాస్ట్ పే సర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ ఇవ్వకపోవడం, డీడీఓ లాగిన్‌లో వివరాలు తొలగించకపోవడంతో విద్యాశాఖ జీతాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
Similar News
News December 4, 2025
తాడో పేడో తేలేది విశాఖలోనే

విశాఖలో ఈనెల 6న భారత్-సౌతాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. తొలి రెండు వన్డేల్లో చెరో మ్యాచ్ గెలవడంతో విశాఖ మ్యచ్ సిరీస్‌ను డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆశక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టికెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నేడు రెండు టీముల ప్లేయర్లు విశాఖకు రానున్నారు.

ఏలూరు: అంగన్వాడీకి వెళ్తుండగా కాటేసిన పాము

వేలేరుపాడు (M) రామవరంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దివాకర్, దీపిక దంపతుల కుమారుడు హన్సిక్ (5) పాము కాటుకు గురై మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండగా దారిలో పాము కరిచింది. వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.