News September 22, 2025
డీజేలకు అనుమతులు లేవు: ఆదిలాబాద్ ఎస్పీ

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతులు లేవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సుప్రీంకోర్టు నియమ నిబంధనలను లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శారదా దేవి మండప కమిటీల వద్ద మహిళా సిబ్బంది, షీ టీం బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News September 22, 2025
ఉట్నూర్: ఐఏటీలో గిరిజన విద్యార్థిని ప్రతిభ

ఉట్నూర్ మండలంలోని గంగాన్నపేట్‌కు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729వ ర్యాంక్ సాధించింది. ఒడిశాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఐదేళ్ల బీఎస్ఎంఎస్ కోర్సులో సీటు సంపాదించింది. ప్రతిభ కనబరిచిన కీర్తిని పలువురు అభినందించారు.
News September 22, 2025
ADB: సారీ.. 5 లక్షల మందికి నో శారీ

మహిళలు ఇష్టంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. వారి కోసం తెలంగాణ సర్కారు ఏటా పండుగకు చీరలు అందజేసేది. ప్రభుత్వం మారడంతో గతేడాది ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. ఈసారి ఇద్దామనుకున్నా కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకే ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి ADBలో 9,50,000 వరకు మహిళా ఓటర్లున్నారు. కానీ 40వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 4,50,000 మందికే చీరలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.
News September 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.