News March 8, 2025

డీజేలపై కొరడా ఝలిపిస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో డీజేలపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో చదువుకునే విద్యార్థులకు డీజే శబ్దాల కారణంగా ఇబ్బంది పడటంతో పాటు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వరంగల్ కమిషనర్ పరిధిలో డీజేల వినియోగంపై పోలీసులు నిషేధాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు కమీషనరేట్ పరిధిలో 9 డీజేలను పోలీసులు సీజ్ చేశారు.

Similar News

News November 15, 2025

PDPL: నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహణ: రాజశేఖర్

image

PDPL కలెక్టరేట్‌లో నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్స్‌లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ 60, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ 4, హెచ్ఆర్ 2, ఆఫీస్ బాయ్ 1 పోస్టులకు అవసరమైన అర్హతలు ఇంటర్, డిగ్రీ, డిప్లమా, అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, పదో తరగతి. అభ్యర్థులు 19న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్‌తో హాజరై నమోదు చేసుకోవాలన్నారు.

News November 15, 2025

విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన MHBD ఎమ్మెల్యే

image

సాధారణ ప్రజా ప్రతినిధిలా కాకుండా, సమాజ సేవలో తన వృత్తి విలువలను కలిపి పని చేయడం మానుకోట ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రత్యేకత. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో నేరుగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని విద్యార్థులకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే పదవి ఉన్నా, సర్వసాధారణ వైద్యునిలా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు.

News November 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.