News December 30, 2025
డీజే ఈవెంట్స్.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం నిషేధం: ఎస్పీ

ASF జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహణ చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై కేక్ కటింగ్‌లు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని గుర్తు చేశారు.
Similar News
News January 2, 2026
నూతన బాపట్ల జిల్లా మ్యాప్ ఇదే..!

బాపట్ల జిల్లా నూతన మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. గతంలో ఆరు నియోజకవర్గాల్లో 25 మండలాలతో బాపట్ల జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల విభజన జరగడంతో బాపట్ల జిల్లాలోని అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపారు. దీంతో బాపట్ల జిల్లా ఐదు నియోజకవర్గాలకు పరిమితమై, 20 మండలాలు ఉన్నాయి.
News January 2, 2026
94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు రాజముద్రతో కూడిన 94,090 నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాల స్థానంలో ఇవి అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.
News January 2, 2026
నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.


