News August 27, 2024

డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండండి: ప్రకాశం పోలీస్

image

సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి మీకు తెలిసిన వ్యక్తుల వాయిస్‌తో ఫోన్ చేయటం లేదా ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని డబ్బులు అడగటం, అత్యవసరం ఆపదలో ఉన్నామంటూ తొందరపెట్టి మీ నగదు కొట్టేసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ AR దామోదర్ తెలియజేశారు. సైబర్ నేరాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సంప్రదించాలన్నారు.

Similar News

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.

News December 14, 2025

తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.