News October 15, 2025
డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నేతలు

సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నియోజకవర్గ నేతలు కూడా ఉన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్లకు పలువురు మద్దతు పలికారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో NOV 6 ఉ.7 గంటల నుంచి 11 సా. 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది TV, రేడియో, పత్రికలు, SM, డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు/జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. కాగా NOV 11న పోలింగ్ జరగనుంది.
News October 15, 2025
అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

బొబ్బిలి మండలం కృపావలసకు చెందిన గిరిజన విద్యార్థిని తాడంగి పల్లవి (11) అనారోగ్యంతో ఈనెల 12న విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లవి సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చి అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం మృతి చెందింది. మృతి విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
News October 15, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడి 82,380 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు వృద్ధి చెంది 25,262 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, L&T, ఎటర్నల్, బెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.