News March 30, 2025
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

డెంకాడ మండలంలోని శనివారం రాత్రి ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో విజయనగరంలోని గాంధీనగర్‌కు చెందిన నేమాల రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుడు సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉగాది రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
Similar News
News April 1, 2025
యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.
News April 1, 2025
భీమిలి బీచ్‌లో విజయనగరం వాసి మృతి

భీమిలి బీచ్‌లో విజయనగరం జిల్లా వాసి సోమవారం మృతి చెందారు. గజపతినగరం ప్రాంతానికి చెందిన పరదేశి(37) భీమిలీ బీచ్‌లో స్నానానికి వచ్చాడు. స్నానం చేసిన అనంతరం ఒడ్డుపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు.
News April 1, 2025
మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు. మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.