News January 1, 2026
డెలివరీ అయ్యాక బెల్ట్ వాడుతున్నారా?

డెలివరీ అయ్యాక కండరాల పటుత్వం కోసం, పొట్ట పెరగకుండా ఉండేందుకు చాలా మంది మహిళలు Abdominal Belt వాడుతుంటారు. నార్మల్ డెలివరీ అయితే 1-2 రోజులకు, సిజేరియన్ అయితే డాక్టర్ సూచనతో 7-10 రోజులకు మొదలుపెట్టొచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రోజుకు 2-8 గంటలు, మూడు నెలల పాటు వాడితే సరిపోతుందంటున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బెల్ట్ వాడకూడదని చెబుతున్నారు.
Similar News
News February 20, 2026
కోతికి కొబ్బరిచిప్ప.. ట్రంప్‌కు అధ్యక్ష పదవి

మొన్నటిదాకా నోబెల్ శాంతి పురస్కారం కోసం తపించిన ట్రంప్‌కు కొత్త కోరిక పుట్టింది. స్వతహాగా రియల్టరైన తన పేరిట శాశ్వత నిర్మాణాలు లేకపోతే అమెరికాకు కళ ఉండదని కలగన్నారేమో. రాజధాని వాషింగ్టన్‌లోని కెనడీ స్మారక కాంప్లెక్సును ట్రంప్-కెనడీ సెంటర్‌గా మార్చేందుకు సైన్ చేసేసుకున్నారు. తాజాగా ప్రఖ్యాత పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంపన్న పేరు పెట్టి అనుగ్రహం పొందేందుకు ఫ్లోరిడా అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. కర్మ!
News February 20, 2026
సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగతా వాటికి వ్యాధి వ్యాపించదు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.


