News December 29, 2025

డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

image

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్‌గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.

Similar News

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

image

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 1, 2026

కొత్త సంవత్సరంలో మనం చేసే చిన్న పొరపాటు!

image

క్యాలెండర్ మారుతుంది కానీ.. మన చేతి అలవాటు మారదు. న్యూఇయర్ రోజు ప్రతి ఒక్కరూ చేసే చిన్న పొరపాటు.. తేదీలో పాత ఏడాదిని రాయడం. ఆఫీసు ఫైళ్లు, పుస్తకాలపై పొరపాటున పాత ఏడాదిని రాసి ఆపై నాలుక కరుచుకుని కొట్టివేయడం చేస్తూనే ఉంటాం. ఫోన్లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నా మన పెన్ను మాత్రం పాత ఏడాది వైపే మొగ్గు చూపుతుంది. గుర్తుంచుకోండి ఇక నుంచి 2025 కాదు.. 2026.

News January 1, 2026

వంటింటి చిట్కాలు

image

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.