News December 26, 2025

డెలివరీ తర్వాత డిప్రెషన్‌ ఎందుకు?

image

గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో, హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. దీంతో కొందరు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ప్రెగ్నెన్సీలో సమస్యలు, ఒత్తిడి, వంశపారంపర్యం వల్ల కూడా కొందరు డిప్రెషన్‌కి లోనవుతారని వైద్యులు చెబుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే పోషకాహారం తీసుకోవడం, సన్నిహితులతో ఎక్కువగా గడపడం, సరిపడా నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

Similar News

News December 26, 2025

దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు?

image

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అనసూయ దేవిల పుత్రుడైన దత్తుని 3 తలలు సృష్టి, స్థితి, లయకారక శక్తికి, ఆరు చేతులు సర్వదిక్కుల వ్యాప్తికి సంకేతాలు. ప్రకృతిలోని 24 అంశాలను గురువులుగా స్వీకరించిన ఈయన విశ్వగురువు. ఆయనను పూజించి అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయని నమ్మకం. దత్తాత్రేయుని ఆరాధిస్తే అటు గురువు, ఇటు దైవం ఇద్దరి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.

News December 26, 2025

త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

image

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్‌లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.

News December 26, 2025

KTR, హరీశ్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నాగార్జునకు లేఖ

image

TG: KTR, హరీశ్‌రావులను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని, అబద్ధాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దర్నీ తీసుకుంటే వచ్చే సీజన్‌లో రేటింగ్ అమాంతం పెరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు.