News December 16, 2025
డేంజర్‌లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.
Similar News
News March 4, 2026
ఈ నెల 9న సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటన

ఈనెల 9న సీఎం చంద్రబాబు డోన్(M) కొత్తబురుజు గ్రామంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో పేర్కొన్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, అధికారులతో కలిసికట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
News March 4, 2026
అంగన్‌వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్‌వాడీల అరెస్ట్‌పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.
News March 4, 2026
నెతన్యాహు సైనికుడిగా ఉన్నప్పుడు..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలో ఆ దేశ సైన్యంలో పని చేశారు. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)లో సేవలు అందించారు. IDFలో టాప్ సీక్రెట్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే ‘Sayeret Matkal’ అనే యూనిట్‌లో పని చేశారు. 1972లో సబేనా ప్లేన్ బందీల రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 1973లో కెప్టెన్ ర్యాంక్ సాధించారు. 1996లో ఇజ్రాయెల్ ప్రధానిగా గెలిచి, పిన్నవయసు PMగా ఘనత సాధించారు.


