News December 30, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ మంగళవారం తెల్లవారుజామున 285కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈసమస్య ఎక్కువగా ఉంది.

SHARE IT

Similar News

News December 30, 2025

ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

image

ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఇంటిపెద్ద మరణిస్తే కుటుంబ అవసరాలకు కొంత మొత్తాన్ని ప్రతినెలా అందిస్తారు. ఇది రెంట్, బిల్లులు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రతినెలా ఎంత అవసరం, ప్రతి ఏటా 5-10% పెంచి అందించాలనే ఆప్షన్‌ కూడా ముందే సెలక్ట్ చేసుకోవచ్చు. ఇంటిపెద్ద మరణించినా ఆర్థిక భరోసా ఉంటుంది.

News December 30, 2025

చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

image

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.

News December 30, 2025

డీజే ఈవెంట్స్.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం నిషేధం: ఎస్పీ

image

ASF జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహణ చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతులు లేవన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై కేక్ కటింగ్‌లు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని గుర్తు చేశారు.