News November 11, 2025
డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
Similar News
News November 11, 2025
కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.
News November 11, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(<
News November 11, 2025
పెరగనున్న చలి.. ఇవాళ్టి నుంచి జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న TGలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. అటు APలోని విశాఖ, మన్యం జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.


