News December 15, 2025

‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

image

AP: రాష్ట్రావతరణ దినంపై కొందరు రాజకీయం చేస్తున్నారని CM CBN మండిపడ్డారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 OCT 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956 NOV 1న AP ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయం చేస్తున్నారు. అందుకే శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని మెమోరియల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Similar News

News December 18, 2025

ట్రైన్‌లో రాత్రిపూట ప్రయాణిస్తున్నారా?

image

ఎక్కువ దూరం రైలులో వెళ్లాలంటే చాలామంది రాత్రి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రైన్‌ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. 10:00 PM తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మ్యూజిక్ పెట్టకూడదు. వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ-టికెట్‌తో ప్రయాణించే వారు ID కార్డు చూపించాలి. మద్యం సేవించడం నేరం. ఏదైనా సమస్య వస్తే RPF లేదా 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

News December 18, 2025

21 ఏళ్లకే సర్పంచ్‌ పదవి

image

TG: పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. సంగారెడ్డి(D) కల్హేర్(M) అలీఖాన్‌‌పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా(Left) 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేట(D) అక్కన్నపేట(M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిన్న వయసులోనే సర్పంచులుగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 18, 2025

కుంకుమ సువాసన, రంగు కూడా ఆరోగ్యమే

image

నుదిటిపై కుంకుమ ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! అయితే దాని వాసన, రంగుతో కూడా ఆరోగ్యపరంగా మనకెన్నో లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. ‘కుంకుమ సువాసన మన శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది. దీని ఎరుపు రంగు సంపూర్ణ అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం భౌతిక సుఖాల పట్ల నిర్లిప్తతను పెంచి, అంతిమ చైతన్యం వైపు మనల్ని నడిపించేందుకు సహాయపడుతుంది’ అని అంటున్నారు.